DR. CHINTAPATLA VENKATA CHARY ' డా: చింతపట్ల వెంకటాచారి ( సంక్షిప్త పరిచయం )
చింతపట్ల వెంకటాచారి గారు (తెలంగాణ రాష్ట్రం, యదాద్రి భువనగిరి జిల్లా మొగ్డుంపల్లి గ్రామంలో కీ:శే: సత్తయ్య చారి మరియు లక్ష్మినర్సమ్మ గార్లకు పంచమ (5) పుత్రుడుగా విశ్వకర్మ వంశంలో, మయ శిల్ప కుటుంబంలో జన్మించారు. వీరికి నలుగురు అన్నలు ముగ్గురు అక్కలు ఉన్నారు. వీరి కుటుంబం సభ్యులు అందరూ దారుశిల్ప కళా నిపుణులు, వీరి నాన్న గారు దారుశిల్పం లో మరియు దేవాలయ సింహ ద్వారాలు, పల్లకీలు మరియు రధాలు చేయడంలో చింతపట్ల సత్తయ్య చారి గారికి ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో మంచి పేరు ఉంది.
బాల్యం : వెంకటాచారి గారి ప్రాధమిక విధ్యాబ్యాసం 2వ తరగతి వరకు పుట్టిన గ్రామంలో సాగింది తదుపరి భాగ్యనగరానికి, గ్రామాల్లో పనులు సమర్ధవంతముగా లేకపోవడం వల్ల కుటుంబ సబ్యులతో హైదరాబాదు నగరానికి వలస రావడం జరిగింది. 1975 నుండి 83 వరకు ఉస్మానియా విశ్వ విద్యాలయం అనుబంద మోడల్ హై స్కూల్, సీతాఫల్ మండి లో పదవ (10) తరగతి వరకు సాగింది. అటు పిమ్మట ఉన్నత విధ్య సర్దార్ పటేల్ కాలేజీ నందు మరియు 1989 లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ డిప్లొమా డ్రాఫ్ట్స్ మెన్ మెకానికల్ కోర్సు పూర్తీ చేయడం జరిగింది.
1992 నుండి 94 వరకు ఆటోకాడ్, మాయ వంటి విభాగాలలో కంప్యూటర్ శిక్షణ పూర్తీ చేయడం జరిగింది. తదుపరి 1995 నుండి 1996 వరకు పారిశ్రామిక శిక్షణ కేంద్రం లో ప్రధాన శిక్షకుడిగా భాద్యతలను నిర్వహించడం జరిగింది.
వివాహం : 1996 నవంబర్ 27న నిజామాబాదు వాస్తవ్యులు శ్రీ బోనాలి రాజయ్య, నీలావతి దంపతుల ద్వితీయ పుత్రిక రజని తో హైదరాబాద్ లో వివాహం జరిగింది. శ్రీమతి రజని గారు బీ.కాం. ఏం.బీయే పట్టబద్రులు . బ్యాంకు ఉద్యోగినిగా చేసి ప్రస్తుతం గృహిణి గా స్థిరపడినారు.
కుటుంబం నేపద్యం : వెంకటాచారి, రాజని గార్లకు సంతానం ఇరువురు కుమార్తెలు పెద్ద అమ్మాయి సాయి శ్రేయ , బీ.టెక్, వీరి వివాహం గోల్కొండ సందీప్ (సాఫ్ట్ వేర్ ఇంజనీర్) తో 30 మే 2022 న వివాహం జరిగింది. రెండవ అమ్మాయి ఖుషి రాజ్ ప్రస్తుతం వైద్య విధ్య అభ్యసిస్తున్నారు.
వ్రుత్తి మరియు వ్యాపారం : 1997 సంత్సరంలో వెంకటాచారి గారు దారు శిల్ప కళా పరిశ్రమను స్థాపించి. ముఖ్యంగా దేవాలయ సింహ ద్వారాలు, పల్లకీలు, స్వామి వారి వాహానాలు, రధములు మరియు ధ్వజ స్థంబములు చేయడంలో వీరికి వీరే సాటి. ఆగమ శాస్త్ర ప్రకారం దేవాలయాలు ఆధ్యాత్మిక మందిరాలు దారు శిల్పాలు నిర్మించడం వీరు ప్రత్యేకత. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో, మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఎన్నో కళా ఖండాలు వీరి చేతిలో ప్రాణం పోసుకోన్నవే. వీరి రూపొందించిన కళా కృతులకు ఎన్నో రాష్ట్ర స్థాయి అవార్డులు, సన్మానాలు సత్కారాలు పొందినారు. వీరి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది ప్రశిష్యులను కల్గి ఉన్నారు ఎంతో మందికి ఈ కళ ద్వారా జీవనోపాధి కలిపించారు. 2000 సంత్సరం వరకు వీరి పరిశ్రమ కొనసాగింది.
తన అభిరుచి మేరకు తన ప్రతిభకు పదుని పెట్టి 'రహస్య లిపి' అనే ఒక నూతన లిపిని సృష్టించినారు. ఇటువంటి లిపిని ప్రపంచంలో పరిశోధన చేసిన తొలి వ్యక్తీ వీరే.
రహస్య లిపి: ప్రపంచంలో తొలి సారిగా తన లిపి లో ఎనమిది భాషల్లో అనగా 'ఆంగ్లం లో బాల రామాయణం '(సంక్షిప్త ), హిందీ లో 'భగవత్ గీత శ్లోకాలు', ఉర్దూ లో 'ఖురాన్' సూక్తులు , పంజాబీ లో 'జపతి సాహెబ్', మలయాళం లో 'సరస్వతి మహత్యం' , కన్నడలో 'వినయక వ్రతం', తమిళ్ లో 'కుమార స్వామి పురాణం' , తెలుగు లో శ్రీ పోతులూరి బ్రహ్మం గారి కాలజ్ఞానం' మరియు డా. బి. ఆర్. అంబేద్కర్ జీవిత చరిత్రలు. రహస్య లిపిలో రాయడం జరిగింది.
ఈ లిపిని క్రికెట్ స్టేడియం మైదానంలో చిహ్నాలుగా రహదారుల పైన సూచన గుర్తులుగా, ఫన్ని గ్రీటింగ్స్ గావాడుకలో ఉన్నది, రహస్య లేఖలు మరియు సైన్సు ఫర్ములాస్కు ఉపయోగపడుతుంది.
రహస్య లిపి ఉపయోగాలు: ఈ లిపి ఉపయోగించి క్రికెట్ స్టేడియం లో, రహదారులపై సూచన గుర్తులుగా , రహస్యమైన సమాచారం పంపించుకునేందుకు మరియు ఎన్నో లాబాలు కల్గిన ఈ లిపి కి ఎన్నో వందకు పై అవార్డులు, రివార్డులు, సన్మానాలు, సత్కారాలు, ప్రపంచ రికార్డులు ఇలా ఎన్నో.
ఒక అక్షరాన్ని సాగదీసి ఏటవాలుగా రాస్తే ఎలా కనిపిస్తుందో అన్న ఆలోచన వెంకటాచారి గారి చే ఈ రహస్య లిపి ని - 'లైన్ స్క్రిప్ట్ ఆర్ట్ ' సృష్టికి దోహదపడింది. ఈ లిపిని ఏటవాలుగా 45 నుండి 75 డిగ్రీల కోణంలో ఒక కన్ను మూసుకొని చేసినట్టైతే అందులో ఉన్న అక్షరాలూ అచ్చు అక్షరాల మాదిరిగా కనిపించి చదువుకునే క్రమంలో లిపిగా కనిపిస్తాయి.
అనుభవం : 2007 సంత్సరం నుండి 2009 వరకు వివిధ ప్రపంచ స్థాయి సంస్థలలో దక్షణ భారత దేశ సమన్వయ కర్త చేసిన అనుభవం అదే ఏడాది 2009 లో వెంకటాచారి గారికి గారు రూపొందించిన రహస్యలిపి గాను అమెరికన్ దేశానికి చెందిన తియోలోజికల్ పరిశోదాన సంస్థ గౌరవ డాక్టరేట్ తో హైదరాబాద్ కేంద్రముగా సత్కరించింది. పర్యటనలు : 2010 నుండి 2012 వరకు తెలుగు ఉభయ రాష్ట్రాలలో అనీ జిల్లాలు మరియు మార్షియాస్, మలేసియా, శ్రీలంక, బాంక్ కాక్, సింగపూర్ వంటి దేశాల తెలుగు వారితో సంప్రదించిన తదుపరి తెలుగు వారికి కూడా ఒక రికార్డ్స్ సంస్థ ఉండాలన్న ఉద్దేశం తో శ్రీ బృందావనం పార్ధసారధి, మార్షియాస్ గారి సూచన మేరకు 2012 లో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ స్థాపించడం జరిగింది.
తెలుగు వారి ఘనతల పుస్తకం (తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ) గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ తరహాలో తెలుగు వారికి కూడా ఒక రికార్డు ( ఘనతల పుస్తకం ) బుక్ ఉండాలన్న ఉద్దేశంతో డా. చింతపట్ల వెంకటాచారి ఆలోచన మేరకు,4 వ తెలుగు ప్రపంచ మహా సభలను పురస్కరించుకొని తేది 24 -12-2012 రోజున మండలి బుద్ధప్రసాద్ గారి చేతులమీదుగా లోగో ఆవిష్కరణ హైదరాబాద్ లో, 30 -12- 2012 రోజున తుమ్మిడి చారిటబుల్ సంస్థ పక్షాన తుమ్మిడి రాం కుమార్ గారి చేతులమీదుగా, విజగ్ లో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వెబ్ సైట్ ఆవిష్కరణ చేయడం జరిగింది.
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రత్యేకత: తెలుగు వారిలో ఉన్న ప్రతిభాపాటవాలను వెలికి తీసి వారికి ఒక గుర్తింపు నిచ్చే ఘనతల పుస్తకంముగా ప్రారంభించబడిన సంస్థ ప్రవాస మరియు నివాస తెలుగు వారు ఇందులో దరఖాస్తు పెట్టుకోవచ్చు, ఇందులో ముఖ్యంగా తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలు, తెలుగు ఔనత్యం, తెలుగు వారి కట్టు బొట్టు, తెలుగు పండుగలు, తెలుగు కవులు, తెలుగు ప్రాచీన కట్టడాలు, తెలుగు వారు నిర్వహించే వింతలూ విశేషాలు, వినోద, విజ్ఞాన వివిధ అంశాలకు ఇందులో నమోదు చేసుకోవడానికి అర్హత ఉండును (ప్రానంతకమైన ప్రతిభలకు స్థానం లేదు ).
తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ గౌరవ సభ్యులు తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ గౌరవ సలహాదారులుగా తెలుగు అధికార భాష సంఘం అధ్యక్షులు, పూర్వపు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి స్పీకర్ * శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు , * బృందావన పార్ధసారథి - (మార్షియాస్ తెలుగు గురుకుల పాఠశాల వ్యవస్థాపకులు), * ప్రముఖ కుటుంబ సలహాల వైద్యులు, డాక్టర్ సమరం, * అన్నవరం రామ స్వామి ( ప్రముఖ సంగీత విద్వాంసులు), * జె . డి. లక్ష్మి నారాయణ గారు, ఐ పి ఎస్ . * శ్రీ ఘంటసాల రత్న కుమార్ ( ప్రముఖ గాయకుడు) * డా : సాయి శ్రీ గారు ( ప్రముఖ మానసిక నిపుణులు), * శ్రీ ఆనందా చారి వేలు ( ప్రముఖ ఆగమ శాస్త్ర నిపుణులు, దేవాదాయ శాఖ పూర్వపు డిప్యూటీ స్థపతి), * డా. గుజ్జారి శ్రీధర్ బాబు గారు, (ప్రముఖ విద్యా సంస్థల అధినేత), డా. శ్రీనాథ చారి ( ప్రోఫెసేర్ ఇంగ్లీష్ విభాగం అధిపతి పాలమూరు విశ్వవిద్యాలయం ) డా. కూరెల్ల విటలాచారి ( ప్రముఖ సాహితీ వేత్త అభినవ పోతన బిరుదాంకితుడు) గార్ల ఆశీర్వచనాలతో సంస్థ ను ఏర్పాటు చేయడం జరిగింది .
* తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ ISO - UK సర్టిఫైడ్ సంస్థ గా పేరొందినది. * తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ ఆన్ లైన్ రేడియో ( తరంగా రేడియో USA అనుబందముగా )
వెంకటాచారి గారి ప్రత్యేకతలు : * చిత్రకారుడు * దారు శిల్ప కళా నిపుణుడు * ఫోటో గ్రాఫిక్ * వీడియో గ్రాపిక్ * అనిమేషన్ మాయ డిసైనేర్, వేబ్ సైట్ డిసైనేర్ * సింగర్ * ఆర్గనైసేర్.
వివిధ సంస్థ లలో వీరి పాత్ర : * తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ - వ్యవస్థాపక అధ్యక్షులు మరియు చైర్మెన్
- తెలంగాణ రికార్డుల పుస్తకం - వ్యవస్థాపక అధ్యక్షులు మరియు చైర్మెన్
- సూపర్ కిడ్స్ రికార్డ్స్ - వ్యవస్థాపక అధ్యక్షులు మరియు చైర్మెన్
- వరల్డ్ రికార్డ్స్ అకాడమీ ఇండియా - జాతీయ సలహాదారుడు
- విరాట్ విశ్వకర్మ ఆర్ట్స్ & క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఇండియా - వ్యవస్థాపక అధ్యక్షులు
- ఇంప్రూవ్ మెమరీ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ - వ్యవస్థాపక అధ్యక్షులు
- అకాడమిక్ అచివ్ మెంట్స్ అవార్డ్స్ అసోసియేషన్ హైదరాబాద్ - వ్యవస్థాపకులు
- దారు శిల్పి సతయ్యా చారి మెమోరియల్ ట్రస్ట్ - వ్యవస్థాపక అధ్యక్షులు
- విశ్వ జ్యోతి సంక్షేమ సంఘం - వైస్ చైర్మెన్ మరియు ఫౌండర్ మెంబెర్
- విశ్వ జ్యోతి యువ జ్యోతి - ముఖ్య సలహాదారులు
- సింగ్ ఏ లాంగ్ సంస్థ - వ్యవస్థాపక అధ్యక్షులు
- సమతా గోపాల్ కళా నిలయం - వర్కింగ్ ప్రెసిడెంట్
- సిద్ధాంతి ఎదునోజు నరసింహ చార్య మెమోరియల్ ట్రస్ట్ - ముఖ్య సలహాదారులు
- హైదరబాద్ వెజిటేరియన్ క్లబ్ - వ్యవస్థాపకుడు
- మోడల్ హై స్కూల్ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ క్లబ్ - ఫౌండర్ సెక్రటరీ
సోషల్ మీడియా : తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వెబ్ సైట్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ యూ ట్యూబ్ చానెల్ డా: చింతపట్ల వెంకటాచారి - వికీ పిడియా లో చుదోచు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వికీ పిడియా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ట్విట్టర్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఫేస్ బుక్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ - ఇన్ స్టా గ్రామ అంతర్జాలం లో : డా: చింతపట్ల వెంకటాచారి గా మరియు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ గా వికిపిడియా లో మరియు యూ ట్యూబ్, ముఖ పుస్తకం లో సోదించండి . తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ గురించి వివరాలు తెలుసుకోవాలంటే : TELUGU BOOK OF RECORDS లేదా ఈ మెయిల్ ద్వార తెలుసుకోవచ్చు : [email protected]
వెంకటాచారి సాదించిన రికార్డులు లిమ్కా బుక్ అఫ్ రికార్డ్స్ రెండు సార్లు 2009 - 2010 ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో 2009 గ్లోబల్ బుక్ అఫ్ రికార్డ్స్ - 2009 వరల్డ్ రికార్డ్స్ ఇండియా - 2010 వరల్డ్ అమజింగ్ రికార్డ్స్ - 2011 ఎలైట్ వరల్డ్ రికార్డ్స్ - 2011 రికార్డ్స్ సెట్టర్ - న్యూ యార్క్ - 2011 గిన్నిస్ బుక్ అఫ్ రికార్డ్స్ సర్టిఫికేట్ హోల్డర్ . రికార్డు హోల్డర్స్ రిపబ్లిక్ - యు.కె. - 2011 - 2012 ఎవరెస్ట్ వరల్డ్ రికార్డ్స్ లో - 2012 యూనివర్సల్ వరల్డ్ రికార్డ్స్ - 2012 అన్ లైన్ రికార్డ్స్ బ్రేకింగ్ - 2012 గోల్డెన్ బుక్ అఫ్ రికార్డ్స్ - USA . 2013 - 2014.
వెంకటాచారి సాదించిన అవార్డులు :
* లిపి రత్న * లిపి గంధర్వ * కళా మణి * కళా రత్న * కళా గంధర్వ * లైన్స్ క్లబ్ జాతీయ పురస్కారం * రోటరీ ఇంటర్నేషనల్ వొకేషనల్ అవార్డు * బెస్ట్ ఆర్టిస్ట్ అవార్డు * స్టేట్ లెవెల్ యువజన సర్వీస్ అవార్డు * బెస్ట్ ఆర్టిస్ట్ అవార్డు నెహ్రు యువ కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ వారిచే * నేషనల్ లెవెల్ ఆర్టిస్ట్ అవార్డు జాతీయ యువజన సర్వీస్ పక్షాన ఆనాటి ప్రెసిడెంట్ శంకర్ దయాళ్ శర్మ వారిచే భోపాల్ లో * యూనిక్ ఆర్టిస్ట్ అవార్డు - అటల్ బిహారి వాజ్ పాయ్ వారిచే * క్రియేటివ్ ఆర్టిస్ట్ అవార్డు - డ్యూక్ అఫ్ ఎడెన్ బర్గ్ uk వారిచే * బెస్ట్ ఆర్టిస్ట్ అవార్డు - పొట్టి శ్రీ రాములు యూనివర్సిటీ వారిచే * బెస్ట్ క్రియేటివ్ ఆర్టిస్ట్ - IIT ముంబై వారిచే మరియు సత్కారాలు , సన్మానాలు ... ఎన్నో ...